Wednesday, August 20, 2014

మత మార్పిడి -తప్పెవరిది...మార్చేవాడిదా? మారేవాడిదా?..



శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

- ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వలన స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే.

 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం ||

- బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.

ఎన్నాళ్లు ఇలా పేదలుగా ఉంటారు? మా మతంలోకి మారితే ఇళ్లు ఇస్తాం,మీ పిల్లలు చదివిస్తాము , అన్ని విధాలుగా బాగా చూసుకుంటాం . రండి
ఇలాంటి ప్రాలోభాలకు లొంగి మన మతాన్ని వీడకండి .
తమది ప్రచారం మాత్రమే అంటారు వాళ్లు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తప్పేముంది అంటారు .

మనదేశంలో  జరుగుతున్న మత మార్పిడులను పరిశీలిస్తే రాజ్యాంగం ప్రకారం మత ప్రచారం చేసే హక్కు, నచ్చిన మతంలోకి స్వచ్ఛందంగా మారే హక్కూ ఎవరికైనా ఉన్నప్పటికీ, జరుగుతున్న సంఘటనలు అంత సాఫీగా సాగిపోతున్నట్టు కనిపించడం లేదు. అనేక సందర్భాల్లో 'తీవ్రమైన ప్రచార ఒత్తిడి'కి లోనైన వారు ------లోకి మారిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.


'సమస్య లేని సమాజం, ఇబ్బంది లేని మనిషి ఎవరుంటారు? ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి సాయపడడం మానవత్వం. ఇబ్బందిని పరిష్కరిస్తాం. మా మతంలోకి రండి అనడం షరతులతో కూడిన ప్రలోభం, మతాంతరీకరణ అంశంలో మామూలు ప్రచారంతో పాటు రెండోదీ ఉధృతంగా సాగుతోంది'' అని ఒక సామాజిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒకప్పుడు హిందూమతంలో ఉన్న వివక్షను, సామాజిక అంతరాలను ఎదిరించడానికి, అగ్ర కులాల దుర్మార్గాల నుంచి తప్పించుకోవడానికి దళిత వర్గాలు మత మార్పిడిని ఎంచుకున్నాయి. స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకున్నాయి.

భారత్‌లో మత మార్పిడులు కూడదంటూ చట్టాలు చెయ్యడం ఒప్పనంటున్నారు ----- గారు. మత స్వేచ్ఛకు అది భంగమట! వంద కోట్ల జనాభా (95 శాతం మంది --వేతరులు), పేదరికం (దుప్పట్లిచ్చి మతం మార్చెయ్యొచ్చు), పరమత సహనంతో ఉండే ప్రజలు ఏమీ అనుకోరు, లౌకిక తత్వం (అనగా పెద్ద మతానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుంది), అనుకూలమైన చట్టాలు (లేకపోయినా మార్చుకోవచ్చు).. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే గాల్లో తేలివచ్చే విత్తనాల్లాగా వచ్చి, ఇక్కడ చేరి మొలకలెత్తాలని ప్రయత్నాలు చేసారు, చేస్తున్నారు. పళ్ళ చెట్టుకే గదా రాళ్ళదెబ్బలు
దేశం వాళ్ళకి ప్రచారం చేసుకోండి పోండని చెప్పింది. ఇంటి పెరట్లో ఆడుకోండని పక్క వీధి పిల్లలకు చనువిస్తే పెరడంతా పీకి పందిరి వేయబూనినట్లుగా అయింది మన పరిస్థితి. ఎవరో ఒక్కరిద్దరు మతం మారితే అది మారే వాళ్ళిష్టం. మందలుగా, మూకుమ్మడిగా మారితే అది మార్చే వాళ్ళిష్ట ప్రకారం జరుగుతున్నదని అర్థం.బలవంత మత మార్పిడి మధ్య యుగ సంస్కృతి. ప్రస్తుత సంస్కృతి ఏమిటంటే.. దుప్పట్లిద్దాం, మందులిద్దాం, ఆపై మతం మారుద్దాం. అడ్డుకుంటే, పరమత సహనం లేదంటూ నిందిద్దాం, మతస్వేచ్ఛ గురించి బోధిద్దాం.

మత సంస్కారం, పరమత సహనం అంటే ఏంటో ప్రపంచానికి నేర్పిన ఆధ్యాత్మిక శిఖరానికి ----- గారు నీతులు చెబుతున్నారు.., ఎంత తెంపరితనం

మనదేశంలో ఒక్క నెలకి 26 వేలకోట్ల రూపాయలు మత మార్పిడులకు వినియోగిస్తున్నారు అని ఒక సమాచారం


ప్రాచీన సాంప్రదాయములో మతము లేదు. ఉన్నది థర్మమే. అది సనాతన మానవ థర్మము. దాని విలువలు సమస్త మానవ జాతివి.తనను తాను ఉద్దరించుకొనవలెనన్న ప్రతి మానవుడు కూడా థర్మమును అనుసరించవలసినదే.
మతము మనిషి మతి నుండి పుట్టినది. మన వాజ్ఞ్మయములో హిందూ అన్న పదము లేదు. ఉన్నది సనాతన థర్మమే. ప్రస్తుతము మనకు కాపాడుకోవలసినది దీనినే. థర్మమును వీడి ఏమి చేసినా అది కర్ర విడిచి సాము చేసినట్లే.

తన మతము మీద సరియైన విశ్వాసముఅవగాహన లేని వాడే మతము మారుస్తాడు లేక మారుతాడు. మతము మార్చేవాడిని ఏమీ చేయలేము. మహాఐతే దుమ్మెత్తి పోస్తాములేకపోతే చివరికి పాశవికంగా ప్రవర్తిస్తాము. మారే వాళ్ళగురించి ఆలోచించాలి. అసలు వాళ్ళు మతము ఎందుకు మారుతున్నారు. అది తెలుసుకోవాలి. డబ్బు ఆశ చూపించటము వల్లనైతే అది మార్చేవాడి తప్పు ఎలా అవుతుంది.మార్చాలనుకున్న వాడు ఎప్పుడూ ఎదో ఒక ఆశ చూపించి ఇతరులను మార్చాలనే ప్రయత్నిస్తాడు. కాని మారాలనుకునే వాడు ఆలోచించాలి. తను ఎందుకు మతము మారాలి అని ఆలోచించాలి. తన మతములో లేనిది ఇతర మతములో ఏమున్నది అని ఆలోచించాలి. అందర్ని ఎందుకు మార్చలేరుకొందరే ఎందుకు మత మార్పిడులకు గురి అవుతున్నారుఅంటే బలహీనుల్నితన మతము పైన సరియైన అవగాహనవిశ్వాసము లేని వారిని మార్చ గలుగుతున్నారు. మారే వాడు లేకపోతే మార్చేవాడు ఎమీ చేయలేడు. ఎవరినా బాథలో వున్నప్పుడు కానిఅనారోగ్యముగా వున్నప్పుడు కానిఆర్థికముగా ఇబ్బందులలో వున్నప్పుడు కానీ వారి పరిస్థితిని అవకాశముగా తీసుకొని వారికి ఆశచూపి మతము మారుస్తుంటారు. అప్పుడు అలాంటి వారికి బాథ అయినా,అనారోగ్యము అయినా మతము మారటము వల్ల ఉపశమించవు...భగవంతుని అనుగ్రహముతో మాత్రమే మనకు శాంతి లభించగలదు అని
తెలియచేయాలి. వారికి తగిన ఉపశమనము కలిగించాలి. అప్పుడే ఈ మత మార్పిడులను కొంతైనా ఆపగలము.
దానికి మనము ఏమి చేయాలి అని ఆలోచించాలి. ప్రజలలో సరియైన అవగాహన కల్పించాలి. మన మతము యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి. దానికి ప్రభుత్వ సహకారము కూడా కావాలి. ముందు మనవంతు కృషి మనము చేయాలి. అలా చేయాలిఇలా చేయాలి అని తర్కించుకుంటూవాళ్ళని వీళ్ళని నిందించుకుంటూ కూర్చుంటే పని జరగక పోగా మతము మార్చేవాడు మార్చుకుంటూ పోతాడు. చివరికి మనకు మిగిలేదు మన చర్చే.
ముందు మన ప్రాచీన ఋషులు ఏమి అందించారో అది మనము అవగాహన చేసుకోవాలి. పదిమందికు తెలియచేయగలిగే దశకు చేరుకోవాలి. దానికి తగిన సాథన కావాలి. గ్రంథాలుఉపనిషత్తులు చదివిఆచరించక ఇతరులకు చెప్పే హక్కు ఎక్కడినుండి వస్తుంది.ఇతర మతస్తులతో ఎప్పుడైనా చర్చించవలసి వస్తే ముందు మీ గ్రంథాలలో ఏమిచెప్పారో మీకే పూర్తిగా తెలియదుమమ్మల్ని ప్రశ్నస్తారా అని అంటే ఏమి సమాథానము చెపుతాము. చదివి ముక్కున పట్టి అప్పచెప్పినట్లు చెపితే ఎవడికి ఎక్కుతుంది. మన ఋషులు చెప్పినవి మనము ఎందుకు గౌరవిస్తున్నాము... వారు వాటిని ఆచరించి చూపించారు కనుక. శుష్క వేదాంతము చెప్పేవాని మాటలు ఎవరు వినరువానిని ఎవరు గౌరవించరు. మాటలు తప్ప చేతలు లేవు అని ఈసడించుకొంటారు.
ఆ మతము వాడు మతము మారుస్తున్నాడుఈ మతము వాడు మతము మారుస్తున్నాడు అని ఊక దంపుడు ఉపన్యాసములు ఇస్తున్నామే.. ఒకవేళ వాళ్ళు... మీ భగవద్గీత సారాంశము ఏమిటి?, రామాయణము చెపుతున్న థర్మాలు ఏమిటి?, మహాభారతములో చెప్పిన థర్మ సూక్ష్మములు ఏమిటి?, అసలు మీ మతము యొక్క గొప్పతనము ఏమిటి?... భాగవతము ఏమి బోథించింది?.. మేము మా మత ప్రచారము ఎందుకు చేసుకోకూడదునచ్చినవాళ్ళు మా మతములో చేరితే తప్పు ఏమిటి?.... మొదలైన ప్రశ్నలు వేస్తే సమాథానము ఏమి చెబుతాము..మనము చదివినవి బట్టీ పట్టి వాళ్ళ ముందు అప్పచెబుతామా! లేకపోతే మా ఋషులు గొప్పవారు.. వాళ్ళు ఇలా చెప్పారు.. అలా చెప్పారు... మా సంస్కృతి గొప్పది.. భగవంతునికి మా మతము అంటే ఇష్టము అందుకే భారతదేశములో పుట్టాడు అని భగవంతునికి మతము అంటగడతామా...
సరే మీ ఋషులు గొప్పవారు...వారు అందించిన వాజ్ఞ్మయము గొప్పది... కానీ మీరు ఏమి చేశారు.. వాళ్ళు చెప్పినవి ఏమి సాథన చేశారు.. ఆచరించారు..అనుభూతిని పొందారు.. అని అడిగితే సమాథానము చెప్పగల దమ్ము మనదగ్గర వుందాఆచరణ శూన్యమైన జ్ఞానము నిరర్థకము. తెలుసుకొన్న జ్ఞానాన్ని సాథన చేసి అనుభూతి పోందిన వాడు మాత్రమే సమాథానము చెప్పగలడు. అటువంటి వాడు చెప్పిన మాట అక్షరమై (నశింపనిదై) అవతలి వాడిని ఆలోచింప చేస్తుంది. అవతలి వాడిలో భయము పుట్టిస్తుంది.
ఆచరించిఅనుభూతిని పొంది భావితరాల వారికి మార్గదర్శకతను అందించిన వారు మతమును పట్టుకొని వేలాడలేదు. మత మార్పిడులు అన్ని కాలాలలోనూ వున్నవి. ప్రస్తుతము కలి ప్రభావము ఎక్కువగా ఉండటము వల్ల "దూరపు కొండలు నునుపు" అన్న నానుడి వలే తన మతములో లేనిది పర మతములో వున్నది అన్న భావనతో మతము మారుతున్నారు.వారికి నిష్కృతి లేదు.
మతము మారుస్తున్న వాళ్ళను దూషించిహింసించి మత మార్పిళ్ళను ఆపలేము. మతము మారుటకు సిద్థపడుతున్న వారిలో సరియైన అవగాహన పెంచాలి. తన మత ఔన్నత్యాన్ని తెలియచేయాలి. ప్రపంచానికి హిందూ మతము అందించినదేమిటో తెలియచేయాలి. వారిలో థైర్యమును కలిగించాలి. నమ్మకము పెంచాలి. దానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మతము మార్చేవాడు ఎంత పట్టుదలతో పనిచేస్తున్నాడో మనము కూడా అంత పట్టుదలతో మన మతాన్నిథర్మాన్ని కాపాడుకోవాలి. మత మార్పిడి చేస్తున్నవాడి చెంప పగులగొట్టి "కబడ్దార్" అని హెచ్చరించ గలిగే స్థాయికి ప్రతి హిందువూ తయారు కావాలి. అంతటి దమ్ము కావాలి అంటే హిందూ మతముదాని థర్మముఔన్నత్యము తెలుసుకొని ఏ స్థాయిలోనైనా చెప్పగలిగి వుండాలి. ముందు నీ మతములో చెప్పిన సత్యాన్ని గ్రహించుఅంతే కాని వీలయినంత మందిని చేర్చుకుంటే గొప్ప మతము అవదు అని ఎదిరించగలగాలి. ఎదిరించటము అంటే కొట్లాడటము కాదు. తెలియచేయగలగాలి. ఎవరో ఎదో చేస్తారు అని ఎదురు చూడకూడదు. మన ప్రయత్నము అనుస్యూతము సాగించాలి.
మతము మారేవాడు బలహీనుడు. మార్చేవాడు బలవంతుడు. గత 2 లేక 3 శతాబ్దములుగా మనజాతి మానసికముగా బాగా బలహీనపడినది. కనుకనే భారత దేశములో మత మార్పిడులు ఎక్కవైనాయి. కావలసినది శారీరక బలము కాదు.. మానసిక బలము.మా మతములో లేని మీ మతములే ఏమున్నదిమేము ఎందుకు మతము మారాలి అని ప్రతి ఒక్క హిందువూ ప్రశ్నించ గలగాలి.అప్పుడే మత మార్పులను తిప్పి కొట్టగలము.

ప్రపంచమును రక్షించటానికి దాని తల్లితండ్రి వున్నారు. దానికి మనము తన్నుకోనక్కరలేదు..మనల్ని మనం రక్షించుకుందాం..ఇతర మతస్తుల వలే దయచేసి మత ప్రచారము వద్దు.. ధర్మ ప్రచారము చేయండి.. అదే రక్షిస్తుంది... మతము కాదు...మనకు థర్మమే మతము.. మతమే థర్మము.
"ధర్మో రక్షితి రక్షితః" అన్నారు.. "మతో రక్షితి రక్షితః" అనలేదు.
ఎక్కడ ఎక్కువగా మతము మార్చబడుటకు అవకాశము కలదో అక్కడ ఎక్కువగా అవగాహన కలిగించాలి. చర్చల కంటే కార్యాచరణమే ఎక్కువ ఫలితాలనిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ పూనాలి. కార్యరంగములోనికి దిగాలి. అప్పుడే మన సంస్కృతిని కాపాడుకోగలము.

(కొన్నిచోట్ల పేరుకు బదులుగా -- అని పెట్టడం జరిగింది ,అది ఇలాంటి బహిరంగ ప్రదేశంలో ఎందుకూ అని వాడలేదు తప్ప ఏవరికో భయపడి కాదు)

గమనిక :- ఎవరి మనో భావలను దెబ్బ తీయడానికి కాదు ఈ పోస్ట్ , నా హిందూ మతాన్ని నశింపచేస్తున్న వారి వల్ల బలహీనులవుతున్న నా హిందూమిత్రులు స్వధర్మములోనే ఉండాలని ఈ చిన్న ప్రయత్నము తప్ప వేరే ఏ ఉద్దేశము లేదు .. గమనించగలరు

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాది ఒకేమాట ….
హిందూ మతము  మరియూ సనాతన ధర్మ రక్షణకై పోరాడటానికి సంధించిన రామబాణంలా దూసుకుపోవడానికి సిధ్ధముగా ఉండే…..
                                  మీ హైందవ బంధు  నన్నెం శ్రీహర్ష శర్మ

No comments:

Post a Comment