జల స్థల విభాగము
సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు
జంబూద్వీపం - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - మేధాతిథి
శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
శాకద్వీపం - హవ్యుడు
పుష్కరద్వీపం - సేవనుడు.
జంబూద్వీపం - నేరేడు పండ్లు ఎక్కువగా ఉంటాయి. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి (1) ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు (3) హరి (అరేబియా) - దక్షిణము (4) కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం (5) రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము (6) హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము (7) కురు (మంగోలియా) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
ప్లక్షద్వీపం - ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి; పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము; నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
శాల్మలీద్వీపం - ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి; ఇందులో పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష; ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి; నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
కుశద్వీపం - ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము; నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ.
క్రౌంచద్వీపం - ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.; పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.; నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.; దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
శాకద్వీపం - ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి; పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి; విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము; నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
పుష్కరద్వీపం - ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి. పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర; నదులు లేవు.

No comments:
Post a Comment