జనులకు భగినీ హస్తభోజనము విషయము.
రేపు భ్రాతృవిదియ (భగినీహస్త భోజనం)
ఈరోజు భ్రాతృవిదియ. దీనిని కార్తీక శుద్ధ ద్వితీయ రోజున జరుపుకుంటారు. స్మృతి కౌస్తుభము దీనిని ‘యమద్వితీయ’ అని పేర్కొన్నది. ఈనాడు యమ, చిత్రగుప్తాదుల పూజ చేస్తారు. భగినీ (భగినీ అనగా సోదరి) గృహ భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి.
యముడి చెల్లెలు యమునా నది. యమున తన అన్న అయిన యముడిని తన ఇంటికి రమ్మని చాలాసార్లు కోరింది. తీరిక చిక్

కని
పనుల మూలంగా చాలాకాలం ఆమె కోర్కె తీర్చలేకపోయాడు. తుదకు యముడు ఒకనాడు యమున
యింటికి వెళ్తాడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని
ఆమె ఎంతో మర్యాద చేసింది. యముణ్ణి, అతని ముఖ్య లేఖకుడైన చిత్రగుప్తుని,
వారి పరివారాన్ని పూజించింది. స్వయంగా వంటచేసి అందరికీ వడ్డించింది. ఆమె
చేసిన మర్యాదలకు సంతృప్తుడైన యముడు చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమన్నాడు.
దానికి ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే
సోదరునికి నరకాలోక ప్రాప్తి, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించమని
కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదిస్తూ యముడు "ఏ సోదరి ఈనాడు సొదరుని తన
ఇంటికి ఆహ్వానించి తన చేతివంటకాలను వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని
పొందక చిరకాలము పుణ్యస్త్రీగా వుంటుంది" అని కూడా వరమిచ్చారు.
యమునికి మరియు యమునకు ఇటువంటి సోదర ప్రేమ నడచిన విదియ కాబట్టి దీనికి ‘యమద్వితీయ’ అనే పేరు వచ్చింది. ఈనాడు ప్రధానమైన ఆచారం సోదరి తన అన్నదమ్ములను ఇంటికి ఆహ్వానించి పూజించి, క్రొత్తబట్టలు పెట్టి గౌరవించడం. ఈ ఆచారం ఏర్పడిన తరువాత ఈ పర్వదినానికి ‘భాతృవిదియ’, ‘భగినీ హస్తభోజనము’ అనే పేర్లు వచ్చాయి.

No comments:
Post a Comment